
ఏలూరు: చాలా ఏళ్ళ క్రితం ప్రతి ఇంటి ప్రహరీ గోడమీద ‘ఓ స్త్రీ రేపు రా’.. అని కనిపించేది.. దీని గురించి పెద్ద చర్చే జరిగేది.. ఏదో శక్తి తమ ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందని దాన్ని నిరోధించేందుకు ఇలా రాసేవారని అప్పట్లో చెప్పుకునే వాళ్ళు.. ఇక సాధారణంగా ఈ రోజుల్లో అయితే ఖరీదైన ఇళ్ల వాళ్ళు, వ్యాపార సంస్థలు “మీరు సి సి కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు” అని “కుక్కలు ఉన్నాయి జాగ్రత్త ” అని హెచ్చరిక బోర్డ్స్ పెడతారు. ఎందుకంటే.. అపరిచితులు ఆ ప్రాంతంలోకి వస్తే అలెర్టుగా ఉంటారని. ఇలాంటి హెచ్చరికలు మంచివే ఎందుకంటె బంధువులైనా, అపరిచితులు అయినా వచ్చి కుక్క కాటుకు బలి అయితే మంచిది కాదు కదా.. ఇంకా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఎలాంటి అసాంఘిక కలాపాలకు పాల్పడరు.. ఇదంతా ఓ అలర్ట్ లాంటిది.. అయితే భీమవరంలో ఒక చోట “పాములున్నాయి జాగ్రత్త” అనే హెచ్చరిక ఇపుడు ఒక గోడమీద కనిపిస్తుంది.
పాములు ఎపుడూ ఒకచోట వుండవు. అయితే పుట్ట, నివాస యోగ్యంగా ఉంటే మాత్రం అవి ఆహారం కోసం వెళ్లినా తిరిగి వచ్చి అక్కడే రక్షణ పొందుతుంటాయి. అయితే.. ఇంటి గోడ మీద పాములున్నాయి జాగ్రత్త.. అంటూ హెచ్చరిక ఇప్పుడు ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. ఎందుకు ఇలా రాశారు. ఎవరు రాశారు అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇలా రాసి ఉండటం ఎక్కడో అడవులు ప్రాంతాల్లోనో, గ్రామాలు ఉన్న ప్రాంతంలోనో కాదు.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ కు వెళ్ళే రోడ్డు లో పాములు ఉన్నాయి జాగ్రత్త అని రాసి పెట్టారు ఒక ఇంటి యజమాని.. రోడ్డుకు చేరువగా పాత రైస్ మిల్లు ఉంది. అది వాడుకలో లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది.. రైస్ మిల్లుకు ఆనుకుని రోడ్డు పక్కనే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి గోడలపై పాములు ఉన్నాయి జాగ్రత్త అని రాసి ఉంచడం చర్చనీయాంశంగా మారింది.
అటుగా వెళ్ళే వాళ్ళు గోడపై పాములు ఉన్నాయి జాగ్రత్త అని రాసి ఉండటాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడే ట్రేలు వ్యాపారం కూడా చేస్తున్నారు. రాత్రి సమయంలో ట్రేలు ఎవరూ పట్టుకుని పోకుండా ఉండేందుకు.. అలాగే.. ఆ ప్రాంతంలో అసాంఘీక కలపాలకు పాల్పడకుండా ఉండేందుకు ఇలా రాసారని కొందరు అంటున్నారు. మరి కొందరు మాత్రం అక్కడ నిజంగానే పాములు ఉన్నాయని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..