రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన రేపల్లె(Repalle) లో జరిగిన అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన బాపట్ల(Bapatla) పోలీసులు.. నిందితుల్లో ఒకరు మైనర్ అని వెల్లడించారు. అవనిగడ్డలో పని చేసేందుకు దంపతులిద్దరూ నిన్న అర్ధరాత్రి రేపల్లే రైల్వేస్టేషన్‌లో దిగారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోని బెంచ్ పై పడుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన భర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్ కు 200 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. పోలీస్ సైరన్ వినపడడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూసే సరికి.. ఆమెపై అత్యాచారం జరిగినట్లు గుర్తించాం. వారి నుంచి వివరాలు తీసుకొని బాధితురాలిని వెంటనే రేపల్లె సీహెచ్‌సీకి తరలించామని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.
మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందన్న విషయంపై కేసు నమోదు చేసిన వెంటనే దర్యాప్తు ప్రారంభించాం. రేపల్లె నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాల తనిఖీలు చేపట్టాం. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించాం. వెంటనే సీన్ ఆఫ్ క్రైంకి వెళ్లి చూడగా.. గాజులు, చెప్పులు గుర్తించాం. నేరం చేసిన తర్వాత నిందితుల్లో ఒకరు షర్ట్ మార్చుకున్న ప్రదేశాన్ని డాగ్ స్క్వాడ్ బృందం గుర్తించింది. లభించిన ఆధారాల ప్రకారం ముగ్గురు నిందితులకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వారిని అరెస్టు చేశాం. కోర్టులో హాజరుపరిచిన తర్వాత నిందితులను రిమాండ్‌కు తరలిస్తాం.
– వకుల్ జిందాల్, బాపట్ల ఎస్పీ
నిందితుల్లో ఒకరు గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బాధితురాలి భర్త ఇచ్చిన వివరాల ఆధారంగా కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Uttar Pradesh: ఉన్నావ్ లో మరో దారుణం.. ఉద్యోగంలో చేరిన రెండో రోజే.. విగతజీవిగా మారిన నర్స్