కర్ణాటకలోని అప్పర్‌భద్ర ప్రాజెక్ట్‌తో రాయలసీమ ఎడారిగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయప్రాజెక్టుగా గుర్తిస్తూ బడ్జెట్‌లో 5,300 కోట్లు కేటాయించింది. ఈ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టుల్లోకి చేరే నికర జలాలపై ప్రభావం చూపనుంది. రాష్ట్రాల నీటి వాటాను, ప్రభుత్వ అభ్యంతరాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా అప్పర్‌భద్రకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై రాయలసీమ నేతలు మండిపడుతున్నారు.
అప్పర్‌భద్ర డ్యామ్ ప్రాజెక్టు రాయలసీమకు ఉరితాడు కాబోతోందని హెచ్చరించారు బీజేపీ రాయలసీమ కన్వీనర్..మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. పార్టీలకు అతీతంగా ప్రాజెక్టును అడ్డుకుంటామని పిలుపునిచ్చారు.
కర్నూలుజిల్లా ఆదోనిలో ఈనెల 28వ తేదీన అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సేవ్ రాయలసీమ పేరుతో పాదయాత్ర నిర్వహించబోతున్నట్లు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. సీమ ప్రజాప్రతినిధులంతా తమ బిజినెస్ పక్కనపెట్టి ఈ పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. అంతేకాదు..భద్రప్రాజెక్టుకు విషయంలో ఏపీ బీజేపీ మౌనంగా ఉండటంపై బైరెడ్డి మండిపడ్డారు.
తుంగ, భద్ర నదుల ద్వారా వచ్చే నీటిని తుంగభద్ర డ్యామ్‌లో నిల్వ చేసి అక్కడి నుండి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు,తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ జరిగింది. కర్ణాటకలో ప్రస్తుతం భద్రావతినది పై భాగాన‘అప్పర్ భద్ర’ మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తుంగ, భద్ర నదుల నుండి నీటిని తోడి కర్ణాటకలోని చిత్రదుర్గ, చిక్‌మగళూరు, దావణగెరె, తుముకూరు జిల్లాలకు నీరు అందించడానికి ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.
కృష్ణాబేసిన్‌లో భాగమైన తుంగభద్రడ్యామ్ దిగువన ఉన్న ఏపీ,తెలంగాణ అభిప్రాయాలు, అభ్యంతరాలను పట్టించుకోకుండా జాతీయప్రాజెక్టుగా కేంద్రం ఆమోదించింది.ఈ ప్రాజెక్టు మొదటి దశలో 17.4 టీఎంసీలు, రెండవ దశలో 29.9 టీఎంసీల నీటిని తుంగభద్ర డ్యామ్‌లోకి రాకుండా తోడేసుకుంటుంది. దాంతో దిగువనున్న హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి, పోతిరెడ్డిపాడు, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కింద వున్న ఆయకట్టు పూర్తిగా నష్టపోతుందని అభ్యంతరాలు మొదలయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం