
ఏపీ మంత్రి పేర్ని నానికి ఏలూరు ఆర్టీవో అధికారులపై రైతులు ఫిర్యాదు చేశారు. ఆర్టీవో అధికారులు తమ నుంచి డబ్బులూ వసూలు చేస్తున్నారంటూ కృష్ణా జిల్లా చెరుకు రైతులు ఫిర్యాదు చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరికీ ట్రక్టర్ల ద్వారా చెరకు రవాణా చేస్తుండగా, ఆర్టీవో అధికారులు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.
అలాగే కలపర్రు టోల్ గేట్ వద్ద ఒక్కొక్క ట్రాక్టర్ కు రూ.500 డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకుంటే ఓవర్ లోడ్, ఇతర కారణాలను సాకుగా చూపిస్తూ కేసులు రాస్తామని రైతులకు బెదిరిస్తున్నారని, ఈ బాధలన్ని తట్టుకోలేకే మంత్రికి పేర్ని నానికి ఫిర్యాదు చేసినట్లు రైతులు పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లోకి తరలించేందుకు రైతులు ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటారని, అలాంటి రైతులను డబ్బుల ఇవ్వాలని వేదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో మంత్రి నాని రైతుల ఫిర్యాదును రవాణా శాఖ కమిషనర్ ఆంజనేయులకు పంపారు. రైతులు చేసిన ఫిర్యాదులను పరిశీలించిన ఆంజనేయులు.. అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్ పెక్టర్ లోక్‌నాథ్ ప్రసాద్‌ను సస్పెండ్ చేశారు.
Tadipatri fight : తాడిపత్రిలో హై అలర్ట్..అన్ని సెంటర్లలోనూ పికెటింగ్..నేడు కేసులు నమోదు చేసే ఛాన్స్