చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కోళ్లకు కొత్త రోగం.. వామ్మో.. తిరుగుతూనే ఉన్నట్టుండి..

ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. అటు ఉభయగోదావరి జిల్లాలతో పాటు.. ఇటు ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో అంతుచిక్కని వైరస్ పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తోంది. అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కోళ్లకు కొత్త రోగం.. వామ్మో.. తిరుగుతూనే ఉన్నట్టుండి..
Chicken Virus

Updated on: Feb 05, 2025 | 9:09 PM

ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. అటు ఉభయగోదావరి జిల్లాలతో పాటు.. ఇటు ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో అంతుచిక్కని వైరస్ పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తోంది. అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అంతుచిక్కని వైరస్‌ చాపకింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫారాల దగ్గర చనిపోయిన కోళ్లు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ఒక్కొ ఫారంలో రోజుకు సుమారు పదివేల కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. అయితే ఈ కోళ్ల మృతికి కారణం ఏంటన్నది గుర్తించలేకపోతున్నారు..యజమానులు. కోళ్ల మృతితో కోడిగుడ్ల ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఇక్కడి నుంచి నిత్యం పశ్చిమ బెంగాల్, అస్సా రాష్ట్రాలకు నిత్యం 40కి పైగా లారీల్లో కోడిగుడ్లు ఎగుమతి అయ్యేవి. అయితే ఆ సంఖ్య ప్రస్తుతం 25కు పడిపోయింది. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఆ సంఖ్య సింగిల్ డిజిట్‌కు పడిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కోళ్ల మరణాలు ఇలాగే కొనసాగితే భారీ నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..పౌల్ట్రీ యజమానులు. 40 లక్షలకు పైగా కోళ్ల మృతి సాధారణంగా అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05 శాతం లోపు కోళ్లు చనిపోతుంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే లెక్కలోకి తీసుకోరు. అయితే ప్రస్తుతం...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి