Rain Alert: బిగ్ అలెర్ట్.! ఏపీకి ఉరుములతో భారీ వర్షాలు.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

40 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం...! 137 సంవత్సరాల రికార్డును క్రాస్‌ చేసిన వర్షపాతం...! నవరాత్రుల ముందు నుంచే మొదలైన నరకం...! విజయదశమి అయిపోయినా చల్లారని వరుణాగ్రహం...! యస్‌... పశ్చిమ బెంగాల్‌ బెంబేలెత్తిపోతోంది. మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి.? ఇప్పుడు చూసేద్దాం

Rain Alert: బిగ్ అలెర్ట్.! ఏపీకి ఉరుములతో భారీ వర్షాలు.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
Andhra Weather

Updated on: Oct 04, 2025 | 1:51 PM

దక్షిణ అంతర కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతరభాగంగా సగటుసముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో సగటుసముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి.

ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు ౩౦-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30- 40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30- 40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-

ఈరోజు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఇది చదవండి: అక్కడికి ఎలా ఎక్కావు మావ.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే

Follow Us