AP Weather Alert: ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఉపరితల ద్రోణి ఉత్తర తమిళనాడు మరియు పరిసర ప్రాంతాలలో నున్న ఉపరితల ఆవర్తనం నుండి ఈశాన్య రాజస్థాన్ వరకు రాయలసీమ, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. దీంతో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక తీరప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో అమరావతి వాతావరణ శాఖ రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈ రోజు, రేపు, ఎల్లుండి (అక్టోబర్ 12వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈ రోజు, రేపు, ఎల్లుండి (అక్టోబర్ 12వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈ రోజు, రేపు, ఎల్లుండి(అక్టోబర్ 12వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..