AP Weather Alert: తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా అంతర్గత తమిళనాడు వరకు ద్రోణి ఒకటి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి కొనసాగుతున్నది. దీని ప్రభావంతో మే 06వ తేదీ నాటికి అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా కదిలి క్రమముగా వాయుగుండముగా తరువాత 48 గంటల్లో బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు వెల్లడించారు. ఈ సూచనల ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగముతో వీస్తాయి. రేపు తేలిక పాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగముతో వీస్తాయి. ఇక ఎల్లుండి తేలిక పాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తాంధ్ర..
ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. రేపుతేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగముతో వీస్తాయి. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ..
ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
ఇదిలాఉండగా గడచిన 24గంటల్లో రాయలసీమలోని కర్నూల్‌లో అత్యధిక గరిష్ట ఉష్ణో గ్రత 42 .6 డిగ్రీల సెంటి గ్రేడ్‌గా నమోదైంది. అత్యధిక వర్షపాతం జంగ మహేశ్వరపురములో 67.2 మిల్లి మీటర్ల నమోదైందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ప్రకటించారు.