AP Weather Alert: ఏపీ వాసులకు అలెర్ట్.. రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. 3 రోజుపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు..

|

Apr 29, 2022 | 3:36 PM

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో(Andhrapradesh) ఓ వైపు మండిస్తున్న ఎండలు (Summer Heat).. మరోవైపు అకాల వర్షాలుతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఏపీ , యానాంలో..

AP Weather Alert: ఏపీ వాసులకు అలెర్ట్.. రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. 3 రోజుపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు..
Ap Rains
Follow us on

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో(Andhrapradesh) ఓ వైపు మండిస్తున్న ఎండలు (Summer Heat).. మరోవైపు అకాల వర్షాలుతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఏపీ , యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం.. దాని పరిసర ప్రాంతాల మీద ఒక ఉపరితల ఆవర్తనం మే 04 వ తేదీన ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది . దీని ప్రభావం వలన.. రానున్న 24 గంటలలో అల్ప పీడనం అదే ప్రాంతం లో ఏర్పడ వచ్చునని ప్రకటించింది . ఈ అల్పపీడనం నెక్స్ట్ 24 గంటలలో మరింత బలపడే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో రానున్న మూడు రోజుల వరకూ ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం సూచనను చేసింది.

  1. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం :  ఈ రోజు తేలిక పాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు,  ఎల్లుండి( మే 1వ తేదీ) తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
  2. దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు , రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఎల్లుండి(మే 1వ తేదీ) తేలిక పాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
  3. రాయలసీమ: ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. రేపు, ఎల్లుండి తేలిక పాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

మరిన్ని వెదర్ అప్ డేట్స్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

Also Read: Botsa Satyanarayana-KTR: కేటీఆర్ కామెంట్స్ పై స్పందించిన మంత్రి బొత్స.. ఏపీ కి వస్తే తెలుస్తుంది..!

Oarfish: సముద్ర తీరంలో అరుదైన చేప.. ఇలా ఒడ్డుకు రావడం మంచిది కాదంటున్న శాస్త్రవేత్తలు