Thalliki Vandanam: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఆలోపు ఇలా చేయకపోతే.. తల్లికి వందనం డబ్బులు రూ.15వేలు రానట్టే!

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు ఇదో బిగ్‌ అలర్ట్.. వేసవి సెలవులు ముగిశాయి.. మరో వారం రోజుల్లో రాష్టవ్యాప్తంగా స్కూల్‌లు తెరుచుకోఉన్నాయి. దీంతో తల్లికి వందనం నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే తల్లికి వందనం కింద రాష్ట ప్రభుత్వం అందిస్తున్న రూ.15వేలు మీరు రావాలంటే ఈ చిన్న పని మీరు చేయాల్సిందే.. లేదంటే మీకు డబ్బులు రానట్టే! అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Thalliki Vandanam: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఆలోపు ఇలా చేయకపోతే.. తల్లికి వందనం డబ్బులు రూ.15వేలు రానట్టే!
Ap Talli Ki Vandanam Scheme

Updated on: May 26, 2026 | 5:20 PM

ఏపీలోని పాఠశాలకు విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. తల్లికి వందనం కింద అందిస్తున్న రూ.15వేలు అందేందుకు వెంటనే బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని 2024-2025 విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వం అధికారికండా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రతి ఏటా రూ.15వేలు అందిస్తోంది.

అయితే ప్రభుత్వం అందిజేస్తున్న మొత్తం రూ.15వేలలో రూ.13వేలు నేరుగా తల్లి అకౌంట్లో జమ చేస్తుండగా మిగతా రూ.2వేలను స్కూళ్ల నిర్వహణ కోసం కేటాయిస్తున్నారు. అయితే వేసవి సెలవులు ముగిసి జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ నిధులు అకౌంట్లో జమ అవ్వాలంటే విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ అనుసంధానం చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది.

గత సవంత్సరం ఇలా తల్లి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్‌ కార్డు లింక్‌ లేకపోవడంతో.. చాలామంది విద్యార్థులు అర్హత ఉండి కూడా తల్లికి వందనం నిధులు పొందలేదని తెలిపారు. కాబట్టి పోయినసారి ఎదురైన సమస్యను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ విద్యార్థుల తల్లులను అలర్ట్ చేసింది. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకుల దగ్గరకు వెళ్లి తమ అకౌంట్‌కు ఆధార్ లింక్ ఉందో లేదో చెక్‌ చేసుకోవాలని సూచించింది. ఒకవేళ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ కాకపోతే వెంటనే చేసుకోవాలని.. లేకపోతే డబ్బులు అకౌంట్‌లో జమ కావని తెలిపింది.

బ్యాంక్ ఖతాకు ఆధార్ లింగ్ చేయడం ఎలా?

  • మీరు నేరుగా మీ బ్యాంక్ శాఖకు వెళ్లి చాలా సులభంగా ఈ పని పూర్తి చేయవచ్చు.
  • ఇందుకోసం మీ ఆధార్ కార్డ్ ఒరిజినల్, జిరాక్స్, మీ బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ తీసుకెళ్లండి
  • బ్యాంక్‌లో KYC Form అడిగి తీసుకోండి. అందులో మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్, మీ సంతకం చేయండి.
  • ఆ ఫారమ్‌కు ఆధార్ జిరాక్స్ జతచేసి బ్యాంక్ సిబ్బందికి ఇవ్వండి.
  • వారు మీ బయోమెట్రిక్ లేదా ఓటిపి ద్వారా వెరిఫై చేస్తారు.
  • సాధారణంగా 2 నుండి 3 పని దినాలలో మీ లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us