AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Update: ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో..

ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడ్రోజుల్లో వర్షసూచన జారీ చేసింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకశముందని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరింది. పలు ప్రాంతాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.

Weather Update: ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో..
Rains
Venkatrao Lella
|

Updated on: Oct 16, 2026 | 1:37 PM

Share

తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 4.5 కి.మీ మధ్య ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతూ ఉంది. దక్షిణ తమిళనాడు తీరం నుండి ఒడిశా తీరానికి సమీపంలో ఉన్న వాయువ్య బంగాళాఖాతం వరకు ఉన్న నిన్నటి ద్రోణి, ఇప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్నఉపరితల ఆవర్తనం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి, సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతూ ఉంది. వీటి ఫలితంగా  ఏపీలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఈ ప్రాంతాల్లో వర్షాలు..

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. తేలికపాటి నుండి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఇక రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 గరిష్టముగా 60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. అటు రాయలసీమలో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు బలమైన గాలులు గంటకు 30-40 గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణలోనూ వర్షాలు

ఇక తెలంగాణకు కూడా వాతావరణశాఖ భారీ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

Follow Us