AP SEC Nimmagadda: శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్యటన.. షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి

|

Jan 28, 2021 | 6:17 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేశ్ కుమార్  రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పర్యటించనున్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది. 

AP SEC Nimmagadda: శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్యటన.. షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి
Follow us on

AP SEC Nimmagadda: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేశ్ కుమార్  రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పర్యటించనున్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది.  ఈ క్రమంలో జిల్లా అధికారులతో నిమ్మగడ్డ సమీక్షలు జరపనున్నారు. శుక్రవారం ఉదయం 7.40 గంటలకు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకుంటారు.  అనంతరం ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై  మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.  సమీక్ష అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎస్​ఈసీ నిమ్మగడ్డ కర్నూలు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు కర్నూలు చేరుకోనున్న ఆయన..6 గంటల నుంచి  7.30 గంటల వరకు జిల్లా అధికారులతో  సమీక్ష జరపనున్నారు. సమీక్ష ముగిసిన తర్వాత రాత్రి కర్నూలులోనే బస చేయనున్నారు.

శనివారం ఉదయం  6 గంటలకు కర్నూలు నుంచి కడప బయలుదేరనున్న ఎస్ఈసీ..ఉదయం  9  గంటల నుంచి  10 గంటల వరకు జిల్లా అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరపనున్నారు. అనంతరం 11.30 గంటలకు కడప నుంచి బయలుదేరి  12.20 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు.

Also Read:

Madanapalle murders: అలేఖ్య తన పేరును ఆ రోజున ‘మోహిని’గా మార్చుకుంది.. విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు

Fact-Check: ప్రతి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందే.. ఆ కాలేజ్ సర్కులర్ వైరల్.. అది నిజమేనా..?