AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపుపై స్పష్టత ఇచ్చిన విద్యాశాఖ

ఏపీలో వేసవి సెలవుల పొడిగింపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి విద్యాశాఖ చెక్ పెట్టింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జూన్ 12 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు కథనం లోపల ..

Andhra: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపుపై స్పష్టత ఇచ్చిన విద్యాశాఖ
School Students
Ram Naramaneni
|

Updated on: Jun 09, 2026 | 1:35 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభ తేదీపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి విద్యాశాఖ అధికారులు చెక్ పెట్టారు. వేసవి సెలవులను పొడిగిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. విద్యా క్యాలెండర్‌లో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12, 2026 (శుక్రవారం) నుంచి యథావిధిగా పునఃప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. పాఠశాలల ప్రారంభ తేదీలో ఎలాంటి మార్పులు లేవని, విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి గురి అవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఇటీవల తెలంగాణలో పాఠశాలల ప్రారంభ తేదీ మార్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సెలవులు పొడిగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. అయితే తెలంగాణలో జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం కావడంతో అక్కడి ప్రభుత్వం పాఠశాలల ప్రారంభాన్ని జూన్ 15కు వాయిదా వేసింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన విధంగానే జూన్ 12 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని విద్యాశాఖ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించింది. సో.. పిల్లలూ ఇక బ్యాగులు తగిలించుకునేందుకు రెడీ అవ్వొచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు పున: ప్రారంభంపై విద్యాశాఖ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు పున: ప్రారంభంపై విద్యాశాఖ క్లారిటీ
పొద్దున్నే గూడు కట్టిరాత్రికి తినేసే ఈ స్పైడర్ హిస్టరీ తెలుసా?
పొద్దున్నే గూడు కట్టిరాత్రికి తినేసే ఈ స్పైడర్ హిస్టరీ తెలుసా?
అన్నామలై సరికొత్త పొలిటికల్ గేమ్.. దళపతి విజయ్ ఫార్ములాతో..
అన్నామలై సరికొత్త పొలిటికల్ గేమ్.. దళపతి విజయ్ ఫార్ములాతో..
ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ టైమింగ్స్ మార్పు! ఎందుకంటే?
ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ టైమింగ్స్ మార్పు! ఎందుకంటే?
నరరూప రాక్షసులకు మరణశిక్ష విధించిన కోర్టు..!
నరరూప రాక్షసులకు మరణశిక్ష విధించిన కోర్టు..!
తన చేతిపై టాటూ సీక్రెట్ రివీల్ చేసిన నటి ప్రగతి..
తన చేతిపై టాటూ సీక్రెట్ రివీల్ చేసిన నటి ప్రగతి..
ఈ ఫొటోలో దాగున్న పదం ఏంటో 2 సెకన్లలో చెప్పగలరా..?
ఈ ఫొటోలో దాగున్న పదం ఏంటో 2 సెకన్లలో చెప్పగలరా..?
త్వరలో పట్టాలెక్కనున్న పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు.. అన్నీ క్లియర్
త్వరలో పట్టాలెక్కనున్న పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు.. అన్నీ క్లియర్
తులసి మొక్క పక్కన పొరపాటున కూడా ఈ మొక్కలను ఉంచకండి.. మీ ఈ చిన్న త
తులసి మొక్క పక్కన పొరపాటున కూడా ఈ మొక్కలను ఉంచకండి.. మీ ఈ చిన్న త
మహిళా శక్తికి పట్టాభిషేకం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
మహిళా శక్తికి పట్టాభిషేకం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..