Andhra Pradesh: వచ్చే నెల పింఛన్ వచ్చేది 1వ తారీఖున కాదు.. కాస్త లేటుగా.. ఎప్పుడంటే..

|

Mar 15, 2023 | 10:45 AM

ఏపీలో పింఛన్ తీసుకునే వారికి అలర్ట్: ఏప్రిల్‌లో కాస్త ఆలస్యంగా డబ్బులు.. కారణం ఏంటంటే!

Andhra Pradesh: వచ్చే నెల పింఛన్ వచ్చేది 1వ తారీఖున కాదు.. కాస్త లేటుగా.. ఎప్పుడంటే..
Holidays to delay April Pensions
Follow us on

అవ్వాతాతలకు ప్రతి నెల ఠంచనుగా 1వ తారీఖున పింఛన్ అందిస్తుంది జగన్ సర్కార్. వాలంటీర్లు ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి  పింఛన్ మొత్తాన్ని అందజేస్తున్నారు. అయితే ఏప్రిల్ నెలలో మాత్రం.. పెన్షన్ కాస్త లేటుగా అవ్వాతాతలకు అందనుంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏప్రిల్‌ 1వ తేదీని హాలిడేగా ప్రకటించింది. ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 2న ఆదివారం. దీంతో ఏప్రిల్ 3వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్ అందించనున్నారు. ఈ విషయాన్ని ముందుగా అవ్వాతాతలకు తెలియజేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ ఏడాది జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛన్ పెంచింది జగన్ ప్రభుత్వం. సామాజిక పెన్షన్లు 2750కి పెంచి జనవరి 1వ తేదీ నుంచే పంపిణీ చేస్తుంది. అంతకుముందు 2500 ఉండగా… రూ.250 పెంచి రూ. 2,750కి పెన్షన్‌ అందిస్తున్నారు. 2024 జనవరికి రూ.3000 పింఛన్ అందిస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడంతో పింఛన్ పంపిణీలో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టింది ప్రభుత్వం. వేలిముద్రల సమస్య ఉన్న వృద్ధులకు ఆధార్ అనుసంధానంతో లబ్ధిదారుని ఫేస్‌ను యాప్‌లో సరిపోల్చుకొని పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. మార్చి 1 నుంచి ఈ విధానం అమలు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి