కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన సీపీ శ్రీనివాసులు

|

Feb 09, 2021 | 10:08 AM

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు పర్యటించారు. పోలింగ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన సీపీ శ్రీనివాసులు
Follow us on

ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు పర్యటించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్ని గ్రామాలలో ప్రశాంతంగా పోలింగ్ జరగనుందని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు.

అలాగే, సమస్యాత్మక కేంద్రాలలో అదనపు బలగాలతో పర్యవేక్షిస్తున్నట్లు సీపీ తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈ సాయంత్రం లెక్కింపు జరగనుంది. ఈ సమయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదు. నిబంధనలు అతిక్రమిస్తే… చర్యలు తీసుకుంటామని బత్తిన శ్రీనివాసులు హెచ్చరించారు.

Read Also… AP Panchayat Elections 2021 live: రసవత్తరంగా పంచాయతీ ‘తొలి’ పోరు.. కొనసాగుతున్న పోలింగ్..