
AP Local polls 2021 : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేటలో డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో చిన్నగా మొదలైన గొడవ కాస్త ఘర్షణకు దారితీసింది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు రెండు వర్గాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.
మరోవైపు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డబ్బు పంపిణీ చేస్తున్న కొందరిని గ్రామస్థులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా బొట్లవారిపల్లెలో సోమవారం అర్ధరాత్రి కొందరు అభ్యర్థుల మద్దతుదారులు హల్‌చల్ చేశారు. న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు.
Read Also… AP Panchayat Elections 2021 : పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారా..? అయితే ఇలా చేయండి..!