AP Panchayat Elections 2021 : ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో నోటా కూడా.. : గోపాలకృష్ణ ద్వివేది

ఆంధ్రప్రదేశ్ లో రేపే తొలిదశ పంచాయతీ పోటీ ఇప్పటికే ప్రచారం కూడా ముగిసింది పార్టీలతో సంబంధం లేకపోయినా పార్టీలకు అనుబంధం ఉన్న వ్యక్తులు ప్రెసిడెంట్ గా వార్డ్ మెంబెర్స్ గా పోటీలు చేస్తున్నారు..

AP Panchayat Elections 2021 : ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో నోటా కూడా.. : గోపాలకృష్ణ ద్వివేది

Updated on: Feb 09, 2021 | 12:36 AM

AP Panchayat Elections 2021 : ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పంచాయతీ పోటీ ఇప్పటికే ప్రచారం కూడా ముగిసింది పార్టీలతో సంబంధం లేకపోయినా పార్టీలకు అనుబంధం ఉన్న వ్యక్తులు ప్రెసిడెంట్ గా వార్డ్ మెంబెర్స్ గా పోటీలు చేస్తున్నారు. ఈఎన్నికల పై అంతటా ఉత్కంఠనెలకొంది. మొత్తం 12 జిల్లాల్లో.. 2,724 గ్రామ పంచాయతీల్లో.. 29,732 పోలింగ్‌ కేంద్రాలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

జోనల్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సిద్ధంగా ఉన్నారని, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. 3 సైజులలో బ్యాలెట్ బాక్సులను ఎన్నికలకు సిద్ధం చేశామని వెల్లడించారు.అన్నిచోట్లా కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మాస్కులు, గ్లోజులు, శానిటైజర్లు పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పటివరకు 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. జోనల్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సిద్ధంగా ఉన్నారని, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తు కూడా ఉందని, నోటాకి పడిన ఓట్ల లెక్కింపు జరగదని పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

AP Panchayat Elections 2021 : ఆ పంచాయితీలో ఉంది కేవలం 667 మంది ఓటర్లే.. అది ఎక్కడంటే..