AP Municipal Elections counting: విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన 11వ వార్డు జనసేన అభ్యర్థి చనిపోయారు. ఓట్ల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న జనసేన అభ్యర్థి బోను భారతి(55) గుండెపోటుతో మృతి చెందారు. కాగా, విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంట లనుంచే ప్రారంభం అయ్యింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. విశాఖ ఫలితాలు మధ్యాహ్నం వరకు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నగరపాలక, పురపాలిక, నగర పంచాయతీల్లో కౌంటింగ్ పక్రియను అధికారులు ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 నగరపాలక, 71 పురపాలికల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఏలూరు నగరపాలికలో లెక్కింపు ప్రక్రియను నిలిపివేశారు. ఇక హైకోర్టు ఉత్తర్వులకు లోబడే చిలకలూరిపేట ఫలితాలు వెల్లడించనున్నారు.