ఏపీలో నవంబర్ 4, 5 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు.. కారణం ఇదే!

AP MPTC, ZPTC Elections 2026కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు ప్రకటించారు. నవంబర్ 5న MPTC, ZPTC పోలింగ్ జరగనుండగా, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.

ఏపీలో నవంబర్ 4, 5 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు.. కారణం ఇదే!
AP Schools Holidays

Updated on: Nov 03, 2026 | 7:43 PM

AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ZPTC) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు ప్రకటించింది. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

నవంబర్ 5న MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ ఏర్పాట్ల కోసం నవంబర్ 4వ తేదీని కేటాయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించింది.

AP MPTC, ZPTC Elections 2026: సెలవుల వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగానే, ఎల్లుండి (నవంబర్ 5) MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.

MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు, నిర్వహణ కోసం నవంబర్ 4, 5 తేదీల్లో సంబంధిత ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వర్తించనుంది. అలాగే నవంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన విద్యాసంస్థలకు కూడా ఆ రోజు సెలవు ఇవ్వనున్నారు.

అయితే ఎన్నికల పోలింగ్ జరగని ప్రాంతాల్లో మాత్రం సెలవు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకే ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు తమ ప్రాంతాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి సెలవుల వివరాలను తెలుసుకోవాలని సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us