మీ పిల్లలను మోడల్ స్కూల్స్‌లో చేర్చాలనుకుంటున్నారా..? అయితే మీకే ఈ అలెర్ట్. ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ఎంట్రన్స్ కోసం జూన్ 11న ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. అర్హత, ఆసక్తి గలవారు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను సంయుక్త సంచాలకుడు వెంకటకృష్ణారెడ్డి వివరించారు. ఎంట్రన్స్ కోసం మే 10 నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్ పద్దతిలో అప్లికేషన్స్ స్వీకరించనున్నట్లు వెల్లడించారు. సత్తా చాటిన స్టూడెంట్స్ లిస్ట్‌ను జూన్ 16వ తేదీన.. సీట్లు సొంతం చేసుకున్నవారి లిస్ట్‌ను జూన్ 18న అనౌన్స్ చేయనున్నారు.
జూన్ 19వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 21 నుంచి క్లాసులు స్టార్టవుతాయి. ఇప్పటి వరకు లాటరీ విధానంలో సీట్ల అలాట్‌మెంట్ జరగ్గా.. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఎంట్రన్స్ కోసం మే 20న ఉదయం ప్రవేశ పరీక్ష పెట్టనున్నారు. మధ్యాహ్నం APRJC, APRDC ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..