Andhra Pradesh: ఏపీలో ఉద్యోగాల జాతర.. ఉగాదికి నిరుద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కూటమి సర్కార్..

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువతకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే ఉగాది గిఫ్ట్ అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వివిధ దశల్లో గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్ మరియు విద్యాశాఖల్లో భారీగా నియామకాలు చేపట్టనుంది.

Andhra Pradesh: ఏపీలో ఉద్యోగాల జాతర.. ఉగాదికి నిరుద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కూటమి సర్కార్..
Ap Job Calendar 2026 Released

Updated on: Mar 19, 2026 | 7:53 AM

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం అధికారికంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో, యువగళం పాదయాత్రలో లోకేశ్ ఇచ్చిన మాట ప్రకారం.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కేవలం నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా నిర్ణీత గడువులోగా పరీక్షలు నిర్వహించి, పారదర్శక పద్ధతిలో నియామకాలు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఏ శాఖలో ఎన్ని పోస్టులు? ఎప్పుడు నోటిఫికేషన్?

ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. మే నెల నుండి అక్టోబర్ వరకు వివిధ దశల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

  • మే 15: ఉన్నత విద్యా విభాగంలో 1,500 పోస్టులకు నోటిఫికేషన్.
  • ఆగస్టు 15: హోంశాఖలో 2,778 పోస్టులు, ఇతర శాఖల్లో 928 పోస్టులు, 91 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు.
  • సెప్టెంబర్ 15: గ్రూప్-2 కేటగిరీలో 750 పోస్టులకు నోటిఫికేషన్.
  • అక్టోబర్ 15: విద్యాశాఖలో 3,004 పోస్టులకు నోటిఫికేషన్.

మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందని మంత్రి లోకేశ్ తెలిపారు. నిరుద్యోగుల కలలను నిజం చేస్తూ ఏటా ఉగాదికి ఉద్యోగాల పండుగ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు సిద్ధం కావడానికి వీలుగా సిలబస్‌ను ముందుగానే ప్రకటిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఉద్యోగార్థులందరూ స్కిల్ పోర్టల్ నందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు. దీనివల్ల ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన అలర్ట్స్ నేరుగా అభ్యర్థులకు అందుతాయి. ప్రజా ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంది.. ఇక మీ వంతు, పక్కా ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వండి అంటూ మంత్రి లోకేష్ యువతకు పిలుపునిచ్చారు.

Follow Us