Mansas Trust Chairman : జగన్ ప్రభుత్వానికి షాక్..! మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా సంచయిత నియామకం రద్దు..

|

Jun 14, 2021 | 2:07 PM

Mansas Trust Chairman : మాన్సాస్‌, సింహాచ‌లం ట్రస్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను స‌వాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి

Mansas Trust Chairman : జగన్ ప్రభుత్వానికి షాక్..! మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా సంచయిత నియామకం రద్దు..
Ap High Court
Follow us on

Mansas Trust Chairman : మాన్సాస్‌, సింహాచ‌లం ట్రస్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను స‌వాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టును ఆశ్రయించిన విష‌యం తెలిసిందే. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న తర్వాత త‌న నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రభుత్వం జారీచేసిన జీవోను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. తిరిగి అశోక్ గజపతిరాజును ఈ రెండు ట్రస్ట్‌లకు ఛైర్మన్‌గా నియమించాలని ఆదేశించింది. సంచయిత నియామకాన్ని రద్దుచేసింది.

గతేడాది మార్చిలో సింహాచల దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా అనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును ప్రభుత్వం నియమించింది. ఆ మర్నాడే విజయనగరం రాజుల ఆధీనంలోని మాన్సాస్ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా కూడా ఆమెను నియమించడంతో వివాదం మొదలయ్యింది. రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న ట్రస్టు కావడంతో వ‌య‌సులో పెద్దవారు ట్రస్టీగా ఉండాల‌ని.. ప్రభుత్వం నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా ఈ ట్రస్టుల ఛైర్మన్‌ను నియ‌మించింద‌ని అశోక్ గజపతిరాజు న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధ‌న‌ల ప్రకార‌మే నియామ‌కం చేశామ‌ని ప్రభుత్వం వాద‌న‌లు వినిపించింది. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విని తీర్పును రిజ‌ర్వ్ చేసిన ధర్మాస‌నం.. అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా తిరిగి నియ‌మించాల‌ని ఆదేశించింది.

Bankers Meeting: సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం.. వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ

Deceased Client : మరణించిన ఖాతాదారుడి ఖాతాను కంటిన్యూ చేయొచ్చా..! లేదా మూసివేయాలా.. ఆర్బీఐ ఏం చెబుతుంది..

NCB Raids Mumbai Bakery : ముంబై బేకరీపై ఎన్సీబీ దాడులు.. గంజాయితో చేసిన కేక్‌లు అమ్మినందుకు ముగ్గురు అరెస్ట్..