AP Local Polls: ఓట్ల లెక్కింపును వీడియో తీయాలన్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ..కీలక ఆదేశాలు

AP Panchayat Elections: ఓట్ల లెక్కింపును వీడియో తీయాలన్న పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సాగింది.  ఎవరైనా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా వీడియో తీయాలని హైకోర్టు ఆదేశించింది.

AP Local Polls: ఓట్ల లెక్కింపును వీడియో తీయాలన్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ..కీలక ఆదేశాలు
The AP High Court

Edited By: Team Veegam

Updated on: Feb 16, 2021 | 1:15 PM

AP Panchayat Elections:  ఓట్ల లెక్కింపును వీడియో తీయాలన్న పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సాగింది.  ఎవరైనా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా వీడియో తీయాలని హైకోర్టు ఆదేశించింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ధర్మాసనం సూచించింది.  సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో చిత్రీకరిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  ఓట్ల లెక్కింపును ఇప్పటికే చిత్రీకరిస్తున్నామన్న ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.  వీడియోగ్రఫీ విషయంలో ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేయాలన్న హైకోర్టు ఆదేశించింది. కాగా ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు రెండు దశలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 17 న మూడో దశ, ఫిబ్రవరి 21న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు  కరోనా కారణంగా 11 నెలల క్రితం నిలిచిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. గతంలో ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియను కొనసాగించేలా ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ రీషెడ్యూల్ చేస్తూ నోటిఫికేషన్​ను రిలీజ్ చేశారు. మార్చి 10న..  12 కార్పొరేషన్లు, 57 పురపాలికలు, 18 నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Also Read:

పశ్చిమ గోదావరి జిల్లాలో కిడ్నాపైన రొయ్యల వ్యాపారి.. ఖమ్మం జిల్లాలో శమమై తేలాడు.. అసలు ఏమైందంటే..?

నిమ్మర‌సంతో కమ్మనైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకుందాం పదండి..