కాపు, బలిజ, ఒంటరిలకు రిజర్వేషన్ల పై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటీషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. విచారణను ఈ నెల 20 న విచారణకు రానుంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) కోటా కింద కాపులకు గత ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్‌ను అమలుచేసేలా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంలో ఈడబ్ల్యూఎస్ కింద కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5శాతం కల్పిస్తూ గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలుచేసేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు.
అయితే, వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాజ్యానికి నంబర్ కేటాయించేందుకు నిరాకరించారు. దీంతోసీఎం జగన్‌ని ప్రతివాదిగా తొలగిస్తామని జోగయ్య తరపు న్యాయవాది వెల్లడించండంతో కేసు ముందుకు వెళ్లింది. అయితే న్యాయ పరంగా ప్రకారం దక్కవలసిన 5 శాతం రిజర్వేషన్లు దక్కకుండా ముఖ్యమంత్రి జగన్ అడ్డుకుంటున్నారని వాజ్యంలో పేర్కొన్నారు.
రిజర్వేషన్ కల్పిస్తే రాయలసీమలో బలిజలు రాజకీయంగా తమ కులస్థుల ఎదుగుదలకు అడ్డు వస్తారనే 5 శాతం రిజర్వేషన్ కల్పించకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. 2019 ఎన్నికలలో కాపు రిజర్వేషన్ కు తమ మద్దతు అని అధికారంలోకి వచ్చాక 5 శాతం రిజర్వేషన్ దక్కకుండా చేస్తున్నారని.. కాపు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఉన్న జీవో నెం 65,66 లను రద్దు చేయాలని హై కోర్టు లో పిటీషన్ దాఖలు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు రిజర్వేషన్ల పైన కొంత కాలంగా మాజీ ఎంపీ హరి రామ జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రికి లేఖలు రాసారు. ఆమరణ దీక్ష చేశారు. ఆ సందర్భంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోక్యంతో ఆయన దీక్షను విరమించారు.
ఇప్పుడు ఇదే అంశం పైన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడబ్ల్యూఎస్ కింద కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5శాతం కల్పిస్తూ గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలుచేసేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం