ఓరీ దేవుడో.. ఎబోలా వెంటాడుతోంది..! సర్కార్‌ ముందస్తు అప్రమత్తత.. ఎయిర్‌పోర్టుల్లో కట్టుదిట్టమైన నిఘా

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఏపీ ప్రభుత్వం మరో ప్రమాదకరమైన వైరస్ పట్ల ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ (Ebola Virus) కేసులు, మరణాలు వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధమైందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

ఓరీ దేవుడో.. ఎబోలా వెంటాడుతోంది..! సర్కార్‌ ముందస్తు అప్రమత్తత.. ఎయిర్‌పోర్టుల్లో కట్టుదిట్టమైన నిఘా
Ebola Alert In Andhra Pradesh
Image Credit source: Tv9 marathi

Edited By:

Updated on: May 24, 2026 | 7:18 PM

ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో ఎబోలా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా పనిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు, కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్రం పూర్తి స్థాయిలో సిద్ధమైందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

ఎయిర్‌పోర్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు:

వైజాగ్, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ట్రావెల్ హిస్టరీ ఆధారంగా అనుమానితులకు పరీక్షలు నిర్వహించేలా ఎయిర్‌పోర్ట్ అథారిటీ, జిల్లా వైద్య అధికారులతో సమన్వయం చేస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారంటైన్ చేసి, సంబంధిత వ్యక్తులకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఐసోలేషన్ వార్డులు, వైద్య సన్నద్ధత:

అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాల్లోని టీచింగ్ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆసుపత్రిలో కనీసం 15 పడకల చొప్పున సిద్ధం చేస్తున్నారు. పీపీఈ కిట్లు, వైరస్ నిర్ధారణ టెస్టింగ్ కిట్లు తగిన మోతాదులో ఉన్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్ సమయంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు.

ప్రయాణాలపై జాగ్రత్తలు:

కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు అత్యవసరం తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. ఇటీవల ఆ దేశాల నుంచి వచ్చిన వారు అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్రం నుంచి వచ్చే సమాచారాన్ని రాష్ట్రం నిరంతరం పర్యవేక్షిస్తోంది.

లక్షణాలపై అవగాహన అవసరం:

ఎబోలా వైరస్ లక్షణాలు కొన్ని రోజులు బయటపడకపోవచ్చు. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, బలహీనత, గొంతునొప్పి, కండరాల నొప్పులు కనిపిస్తాయి. తరువాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కళ్ల ఎర్రబారడం వంటి సమస్యలు పెరుగుతాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us