
కొనసీమ జిల్లాలోనే ప్రసిద్ధి నారికేళ శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి ప్రభుత్వం కొత్త అధికారులను నియమించింది. పి. గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలంలోని ఈ ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడిగా విల్ల సూర్యనారాయణను నియమిస్తూ దేవాదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మట్టపర్తి హరిశ్చంద్ర ప్రసాద్, కొమ్మిరెడ్డి శ్రీలయ, పడమట మోహనరావు, కడలి జ్యోతి, అల్లవరపు సంతోషి, బొబ్బిలి రాంబాబు, తొత్తరమూడి ప్రభాకరరావు, కముజు త్రినాథ రంగారావు, చోడే క్రాంతి, పావులూరి వరలక్ష్మి, అయినవిల్లి సూర్యనారాయణమూర్తిలను ట్రస్ట్ బోర్డు సభ్యులుగా దేవాదాయ శాఖ నియమించింది.
ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా ఎంపికైన విల్ల సూర్యనారాయణకు గ్రామస్థులతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను పూలమాల, శాలువాతో సత్కరించారు. తమను ఆలయ బోర్డు సభ్యులుగా నియమించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు బోర్డు ఛైర్మన్, సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అండతో ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని బోర్డు సభ్యులు పేర్కొన్నారు.
Ainavilli Temple New Trust Board
ఆలయ ప్రత్యేకతలు
సాధారణంగా అన్ని హిందూ దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ, అయినవిల్లి ఆలయంలో మాత్రం విఘ్నేశ్వరుడి విగ్రహం దక్షిణాభిముఖంగా ఉండటం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. అంతేకాదు ఇక్కడ స్వయంబుగా కొలువై ఉన్న స్వామి వారిని భక్తులు నారికేళ ప్రియుడుగా పిలుస్తారు. భక్తులు తమ మనసులోని కోరికలను తలచుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే, ఎలాంటి విఘ్నాలు లేకుండా పనులు పూర్తవుతాయని, కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాడ నమ్మకం. అక్షర దోశాలు సరిచేసి ఇవ్వు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.