Andhra Pradesh: ఆంధ్రా ప్రజలకు అలెర్ట్.. భూముల ధరలకు రెక్కలొచ్చాయ్..

|

Jun 01, 2023 | 8:42 AM

మే నెల ముగిసింది. జూన్‌ మొదలైంది. చట్టం మారింది. ఇవాల్టి నుంచి భూముల ధరలు పెరుగుతాయి..అర్బన్‌ ఏరియాలు, కొన్ని రూరల్‌ సెంటర్లలో కూడా ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కనీసం 29 నుంచి 31 శాతం ధర పెరగనుంది. కొత్త రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.

Andhra Pradesh: ఆంధ్రా ప్రజలకు అలెర్ట్.. భూముల ధరలకు రెక్కలొచ్చాయ్..
Jagan Sarkar Hikes Land Rates
Follow us on

AP Land Rates Hike: మే నెల ముగిసింది. జూన్‌ మొదలైంది. చట్టం మారింది. ఇవాల్టి నుంచి భూముల ధరలు పెరుగుతాయి..అర్బన్‌ ఏరియాలు, కొన్ని రూరల్‌ సెంటర్లలో కూడా ధరలు పెంచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కనీసం 29 నుంచి 31 శాతం ధర పెరగనుంది. కొత్త రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి భూధరలు పెరగనున్నాయి. రాష్ట్రంలోని భూమి ధరలను పెంచుతున్నట్లు  జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు ఇప్పటికే రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు అవసరమై మార్పు చేర్పులు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.

అయితే రాష్ట్రవ్యాప్తంగా కాకుండా రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే ధరలు పెంచుతున్నారు. అ క్రమంలో రాష్ట్రంలోని 20% మేర గ్రామీణ ప్రాంతాల్లో ధరల సవరణ జరుగుతుంది. మొత్తంగా 2318 ప్రాంతాల్లో కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. అయితే ఎన్టీఆర్ జిల్లాలో 7మండలాల్లో మాత్రమే ధరలు పెరిగాయి. అలాగే హైవేలు, పరిశ్రమలు ఉన్నచోట అధిక ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ.. ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది.

చివరిసారిగా 2020లో ల్యాండ్‌ రేట్స్ పెరిగాయి. అంటే ఆ తర్వాత రాష్ట్రంలో భూధరలు పెంచలేదు. ఇంకా గతేడాది అర్బన్‌ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరిగాయి. ఈ మేరకు స్పెషల్ రివిజన్ పేరుతో ప్రభుత్వం ఇప్పుడు ల్యాండ్ మార్కెట్ విలువ పెంచేందుకు సిద్ధమైంది. పాలనా రాజధానిగా చెబుతున్న విశాఖలో అయితే భూధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో ఏపీలో గత 2 రోజుల నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు రద్దీ పెరిగింది. ఈ క్రమంలో సర్వర్లు మొండికేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలిగింది. ఫలితంగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు ఆఫీసుల వద్ద పడిగాపులు కాశారు. సర్వర్ల మొండికేయడంతో మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం