Tenth ranks: ‘మాదే ఫస్ట్ ర్యాంక్’… ‘కాదు.. కాదు మాదే ఫస్ట్ ర్యాంక్’.. ‘టాప్ 10 ర్యాంకుల్లో 8 మావే’… ‘టాప్ 10లో 9 మా విద్యార్థులవే’.. అంటూ పేపర్లలో, టీవీల్లో విద్యాసంస్థలు ఊదరగొడుతూ ఉంటాయి. అసలు వీటిలో ఎంత నిజముందో ఎవరికీ తెలీదు. అటు విద్యార్థులు, ఇటు పేరెంట్స్ ఈ ర్యాంకుల మాయాజాలం అర్థం కాక గందరగోళానికి గురవుతారు. అయితే ఇకపై ఈ న్యూసెన్స్ ఉండదు. ఈ ప్రకటనల పందేరానికి అడ్డుకట్ట వేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని.. విద్యా సంస్థలను ఆదేశిస్తూ జగన్ ప్రభుత్వం(Jagan Government) ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాంకుల పేరుతో జరిగే ప్రచారం వాస్తవాలను కప్పిపెట్టేలా ఉంటోందంటూ విద్యార్థులు, పేరెంట్స్ నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఉత్తర్వులను లైట్ తీసుకోవాడానికి వీల్లేదు. ఎందుకంటే తప్పుడు ప్రచారం చేసినట్లు తేలితే సంబంధితులకు మూడేళ్లకు తగ్గకుండా ఏడేళ్ల వరకు జైలుశిక్షను విధించే అవకాశం ఉందని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే రూ.లక్ష వరకు ఫైన్ విధించే అధికారం కూడా ఉందని వెల్లడించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలను నడుచుకోవాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి