ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మినీ ట్రక్కులను అందించాలని నిర్ణయించింది. ఇంటింటికీ రేషన్ పంపిణీలో భాగంగా నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పించింది. బీసీ కార్పొరేషన్, బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ ద్వారా ఈ వాహనాలను అందిస్తామని ప్రకటించింది. అయితే ఇందులో 90 శాతం డబ్బులు బ్యాంకు రుణంగా ప్రభుత్వం అందిస్తోంది. మిగిలిన 10 శాతం లబ్ధిదారుడు భరించాలని తెలిపింది. ఈ బ్యాంక్‌లోన్‌లో 30 శాతం 72 వాయిదాల్లో చెల్లించాలని పేర్కొంది. మిగతా 60 శాతం రుణాన్ని ప్రభుత్వం రాయితీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.