House Motion Petition: ఏపీ ప్రభుత్వ హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. కొనసాగుతున్న వాదనలు

|

Feb 07, 2021 | 12:16 PM

House Motion Petition: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పెద్దిరెడ్డిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను సవాల్‌..

House Motion Petition: ఏపీ ప్రభుత్వ హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. కొనసాగుతున్న వాదనలు
Follow us on

House Motion Petition: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పెద్దిరెడ్డిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. దీంతో ఏపీ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. పెద్దిరెడ్డి తరపున న్యాయవాది మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.

కాగా, ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నిన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా చూడాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఆదేశించారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆయన్ను హౌస్‌ అరెస్ట్‌ చేయాలన్నారు. మీడియాతో కూడా మాట్లాడనివ్వద్దని స్పష్టం చేశారు. ఆర్టికల్ 243తోపాటు, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌నూ డీజీపీకి రాసిన లేఖలో నిమ్మగడ్డ ప్రస్తావించారు. చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలను ఆపాలని శనివారం ఆదేశాలు జారీ చేశారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన పెద్దిరెడ్డి.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు స్పందనగా ఎస్‌ఈసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను తాను ఇంకా చూడలేదన్నారు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. వాటిని పరిశీలించిన తర్వాత మాట్లాడతానన్నారు.

Also Read: ”నువ్వేమైనా నార్త్ కొరియా అధ్యక్షుడి కిమ్ జాంగ్ ఉన్‌వా.. ప్రజాస్వామ్యంలో శాసించే అధికారం లేదు” అంబటి ఫైర్..