ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో.. పలు జిల్లాల్లో పాఠశాల విద్యార్థులకు వరుస సెలవులు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ స్కూళ్లకు బ్యాక్ టూ బ్యాక్ 2 హాలిడేస్ వచ్చాయి. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏపీ సర్కార్.. సెప్టెంబర్ 16, సోమవారం రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఇక ఇవాళ సండే హాలిడేనే. తిరికి స్కూల్స్.. మంగళవారం పున:ప్రారంభం అవ్వనున్నాయి. వాస్తవానికి శనివారంతో కలిపి మూడు రోజులు హాలిడేస్ వచ్చేవి. అయితే భారీ వర్షాలు, వరదల ఈ మధ్య స్కూళ్లకు చాలాసార్లు సెలవులు ఇచ్చారు. పలు జిల్లాలలో వరుస సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలో స్కూలు పనిదినాలను దృష్టిలో ఉంచుకుని రెండో శనివారం కూడా (సెప్టెంబర్ 14) తరగతులు నిర్వహించారు.
ఇప్పుడు సెప్టెంబర్ 15 (ఆదివారం) తోడు సెప్టెంబర్ 16( మిలాద్ ఉన్ నబీ) సెలవు కూడా రావటంతో పిల్లలు పండగ చేసుకుంటున్నారు. చాలామంది వినాయక నిమజ్జనాలను ఇప్పుడే ప్లాన్ చేసుకున్నారు. అయితే తెలంగాణలో మాత్రం మిలాద్ ఉన్ నబీ హాలిడేను మంగళవారం జరుపుకోనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన మిలాద్ ఉన్ నబీ సెలవు రోజుగా తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనంతో పాటు.. మిలాద్ ఉన్ నబీ ఒకే రోజు జరపుకోనున్నారు ప్రజలు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా.. పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.