Andhra Pradesh: నాడు-నేడు పథకానికి విరాళాలు.. భవనాలకు దాతల పేర్లు పెట్టడంపై కొత్త నిబంధనలు

|

Feb 09, 2022 | 9:43 AM

AP News: జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నాడు-నేడు పథకంలో భాగంగా విరాళాలలో నిర్మించే పాఠశాలలు, ఆస్పత్రుల భవనాలకు దాతల పేర్లు పెట్టడంపై కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.

Andhra Pradesh: నాడు-నేడు పథకానికి విరాళాలు.. భవనాలకు దాతల పేర్లు పెట్టడంపై కొత్త నిబంధనలు
Nadu Nedu
Follow us on

Nadu Nedu: జగన్ సర్కార్(Jagan Government) కీలక నిర్ణయం తీసుకుంది. నాడు-నేడు పథకంలో భాగంగా విరాళాలలో(Donations) నిర్మించే పాఠశాలలు, ఆస్పత్రుల భవనాలకు దాతల పేర్లు పెట్టడంపై కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను 2021 అక్టోబర్ 6న తీసుకువచ్చింది. తాజాగా ఈ-గెజిట్‌లో వివరాలను అందుబాటులో ఉంచింది. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్‌కు 50 లక్షల రూపాయలు, ప్రాథమిక పాఠశాలకు కోటి రూపాయలు, ఉన్నత పాఠశాలకు 3 కోట్లు ఇస్తే.. వాటికి దాతల పేర్లు పెట్టే ఛాన్స్ ఇస్తారు. ఇక ఆస్పత్రుల విషయానికి వస్తే.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైతే కోటి రూపాయలు, సామాజిక వైద్యశాల అయితే 5 కోట్లు, ప్రాంతీయ ఆస్పత్రి అయితే 10 కోట్లు విరాళం ఇస్తే.. దాతలు పేర్లు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. గరిష్ఠంగా 20 సంవత్సరాల కాల పరిధికి మాత్రమే వారి పేర్లు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా ఏదైనా అదనపు గది, లైబ్రరీ బ్లాక్ నిర్మాణానికి అయ్యే వ్యయానికి విరాళం ఇస్తే.. వాటికి దాతల పేర్లు పెడతారు. కాగా ప్రణాళిక శాఖలోని కనెక్ట్ ఆంధ్ర విభాగం.. ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నాడు- నేడు’ పేరుతో పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దే ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే క్రమంలో ఆస్పత్రుల్లో సైతం సదుపాయాలను, ఎక్విప్‌మెంట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా పాఠశాలలు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నారు. విరాళాలను సైతం ఆహ్వానిస్తున్నారు. ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్య పిల్లలకు అందించే ప్రయత్నంలో భాగంగా  బడుల రూపురేఖలు మారుస్తున్నారు. పేదలకు విద్య, వైద్యం భారం కాకూడదు అన్నది తన నినాదం అన్నది సీఎం జగన్ పలుసార్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

Also Read: Telangana: అక్కడ చిలక తాగిన తాటికల్లుకు యమ డిమాండ్.. బుక్ చేసుకుంటేనే దొరుకుతుంది