పోలింగ్‌ కేంద్రాల వద్ద ఫుల్‌ సెక్యూరిటీ.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు -ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

|

Feb 06, 2021 | 5:38 PM

పీలో స్థానిక సంస్థల ఎన్నికలకు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. నాలుగు దశల్లో ఎన్నికలు

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఫుల్‌ సెక్యూరిటీ.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు -ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
Follow us on

పీలో స్థానిక సంస్థల ఎన్నికలకు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు జరిగే అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు సిబ్బందిని నియమించామని చెప్పారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. 13 వేల పంచాయతీల్లో భద్రత ఏర్పాట్లు చేసినట్లు గౌతం సవాంగ్‌ తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచామన్నారు. షాడో, నిఘా టీమ్‌లు ఏర్పాటు చేశాం. చెక్‌పోస్టుల వద్ద మద్యం, డబ్బు తరలింపుపై తనిఖీలు చేస్తున్నాం. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు.

తొలి విడతలో ఎన్నికలు జరిగే పోలింగ్ బాక్స్‌ల భద్రతకు 61 స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేశాం. 1122 రూట్‌ మొబైల్స్‌, 199 మొబైల్ చెక్‌పోస్టులు, 9 ఎస్సీ రిజర్వు, 9 అడిషనల్ ఎస్సీ రిజర్వ్‌ బలగాలు సిద్ధం చేశాం. ఇప్పటి వరకు 9,199 ఆయుధాలు డిపాజిట్ అయ్యాయి. 1,47,931 బైండోవర్‌, 12,779 భద్రతాపరమైన కేసులు నమోదు చేశామని డీజీపీ వివరించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ద్వారా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు.

 

Read more:

వారి సూచనల మేరకే ప్రభుత్వం నిర్ణయం.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి క్లారిటీ