Pawan kalyan: మధురై చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఘన స్వాగతం పలికిన తమిళనాడు బీజేపీ చీఫ్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ తమిళనాడు పర్యటనకు వెళ్లారు. మధురైలోని మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన మధ్యాహ్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, అధికారులు ఘన స్వాగతం పలికారు.

Pawan kalyan: మధురై చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఘన స్వాగతం పలికిన తమిళనాడు బీజేపీ చీఫ్!
Pawan Kalyan

Updated on: Jun 22, 2025 | 2:56 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ తమిళనాడు పర్యటనకు వెళ్లారు. మధురైలోని మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఎయిర్‌పోర్టుకు వచ్చి వేచిఉన్న తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు. వీరితో పాటు బిజెపి తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చక్రవర్తి, రాష్ట్ర నాయకుడుశ్రీ అమర్ ప్రసాద్ రెడ్డి , మధురై జిల్లా అధ్యక్షులు శ్రీ మారి చక్రవర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ శ్రీనివాసన్, సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ రాధాకృష్ణన్ తదితరులు కూడా పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికారు.

కాగా పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ ముందుగా సాయంత్రం తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అమ్మ తిడల్ ప్రాంగణంలో జరిగే మానాడులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us