AP Covid Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3,010 పాజిటివ్ కేసులు నమోదు.. కోలుకున్న 4,576 మంది..

|

Jul 09, 2021 | 6:03 PM

AP Covid Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా నమోదవుతున్న కేసులే ఇందుకు

AP Covid Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3,010 పాజిటివ్ కేసులు నమోదు.. కోలుకున్న 4,576 మంది..
Blood Clot In Corona Patients
Follow us on

AP Covid Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా నమోదవుతున్న కేసులే ఇందుకు ఉదహరణంగా చెప్పొచ్చు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,00,103 శాంపిల్స్ పరీక్షించగా.. 3,010 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీటిలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 659 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,17,253 కు చేరింది. ఇక కరోనా నుంచి 4,576 మంది కోలుకున్నారు. రికవరీల సంఖ్య 18,73,993 కు చేరింది. కరోనా ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది చనిపోగా.. వారిలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజాగా నమోదైన మరణాలతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ప్రభావంతో చనిపోయిన వారి సంఖ్య 12,960 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,300 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేట్ 3.0 శాతంగా ఉండగా.. రివకరీ రేటు 97.6 శాతంగా ఉంది. మరణాల రేటు 0.67 శాతంగా ఉంది.

ఇక జిల్లాల వారీగా కరోనా వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం – 85, చిత్తూరు – 441, తూర్పు గోదావరి – 659, గుంటూరు – 211, కడప – 158, కృష్ణా – 242, కర్నూలు – 77, నెల్లూరు – 273, ప్రకాశం – 316, శ్రీకాకుళం – 106, విశాఖపట్నం – 130, విజయనగరం – 45, పశ్చిమ గోదావరి – 297 చొప్పున మొత్తం 3,010 పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి.

కాగా, కర్ఫ్యూ వేళలో సడలింపులు జరిగాయని, ప్రజలు మాత్రం తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు. ఒకవేళ వెళ్లినా తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

Also read:

Telangana Jobs: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. మొదటి దశలో 50,000 ఉద్యోగాల భర్తీ

Actress Hariteja: మొదటిసారిగా ‘భూమి’ని అభిమానులకు పరిచయం చేసిన హరితేజ.. తల్లిలా ముద్దుగా ఉందంటున్న ఫ్యాన్స్

Ananthapuramu District: బుజ్జి చిరుత గజగజలాడించింది, పరుగులు పెట్టించింది.. చివరకు