ఏపీలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 28,788 టెస్టులు చేయగా 55 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ఆదివారం రిలీజ్ చేసిన బులిటెన్‌లో తెలిపింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,869కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా కరోనా కారణంగా ఎవరూ మృతి చెందకపోవడం ఊరటనిచ్చే విషయం. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 7,162 మంది మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 735 యాక్టివ్ కేసులున్నాయి.
కొత్తగా మరో 117 మంది కొవిడ్ నుంచి కోలుకోగా..మెుత్తం రికవరీల సంఖ్య 8,80972 లక్షలకు చేరింది. ఇప్పటి వరకూ కరోనా నిర్ధారణ పరీక్షలు 1,35,46,228 లక్షలు దాటినట్లు వైద్యారోగ్య వెల్లడించారు.
#COVIDUpdates: 14/02/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,85,974 పాజిటివ్ కేసు లకు గాను
*8,78,077 మంది డిశ్చార్జ్ కాగా
*7,162 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 735#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/cceB4Jx8tv— ArogyaAndhra (@ArogyaAndhra) February 14, 2021