YS Jagan: నేడు విశాఖకు సీఎం జగన్‌.. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ..

|

Apr 28, 2022 | 7:11 AM

YS Jagan Visakhapatnam Tour: సీఎం జగన్‌ వైజాగ్ టూర్‌.. టెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది. ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని టీడీపీ నేతల ప్రకటనతో విశాఖజిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఇంతకీ సాగరతీరంలో ఇవాళ ఏం జరగబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.

YS Jagan: నేడు విశాఖకు సీఎం జగన్‌.. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ..
Cm Ys Jagan
Follow us on

YS Jagan Visakhapatnam Tour: నవరత్నాల్లో భాగంగా నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా విశాఖపట్నం జిల్లాలో గురువారం సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగే ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 10.40 గంటలకు సబ్బవరం మండలం పైడివాడకు చేరుకుంటారు. 11.05 గంటలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఏర్పాటుచేసిన వేదిక వద్దకు చేరుకుని YSR విగ్రహావిష్కరణ చేస్తారు. అలాగే పార్కు ప్రారంభోత్సవం, లే అవుట్ల పరిశీలన, మోడల్‌ హౌస్‌లను లబ్ధిదారులకు అందజేయడం, పైలాన్‌ ప్రారంభోత్సవం, ల్యాండ్‌ పూలింగ్‌ కోసం భూములిచ్చిన రైతులతో ఫోటో సెషన్‌ కార్యక్రమాల్లో సీఎం జగన్‌ పాల్గొంటారు.

ఇదిలాఉంటే.. ఈ రోజు విశాఖజిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్‌ పర్యటనను అడ్డుకుంటామని టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. సబ్బవరంలో ఇళ్ళపట్టాలు ఇస్తూ స్థానికులకు ఇవ్వకపోవడంతో సీఎం టూర్‌ని అడ్డుకోవాలని స్థానికుల నుంచి ఒత్తిడి ఉందన్నారు బండారు. సబ్బవరం మండలంలో 300 ఎకరాల స్థలాలకు పట్టాలిస్తూ స్థానిక ప్రజలకు కాకుండా బయట మండలాల వాళ్లకు ఇవ్వడం ఎక్కడ న్యాయం అని ప్రశ్నించారు. లాండ్ పూలింగ్, లెవలింగ్, గ్రావెల్ తరలింపు నుంచి స్థలాల కేటాయింపు దాకా ప్రతీదశలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు బండారు.

విశాఖజిల్లాలో ఓ వైపు ముఖ్యమంత్రి పర్యటన..మరోవైపు టిడిపి నేతల ప్రకటనతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానికులతో కలిసి టిడిపి నేతలు వారిని అడ్డుకుంటారా..? లేక ముందే అరెస్టు చేస్తారా..? అసలు ఏం జరగబోతోందో వేచి చూడాల్సిందే.!

Also Read:

AP Online: పారిశ్రామికవేత్తలకు గుడ్‌న్యూస్.. ఇకపై అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోనే..

Andhra Pradesh: వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. త్వరలో కేబినెట్ హోదా