Andhra Pradesh: 29 మందితో ఫైనల్ లిస్ట్.. వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. టెన్షన్..

|

Jan 08, 2024 | 9:44 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అధికారపార్టీ వైసీపీ రెండోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలతో ముందుకువెళ్తోంది.. దీనిలో భాగంగా వైసీపీ అధినేత సీఎం జగన్ పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు.

Andhra Pradesh: 29 మందితో ఫైనల్ లిస్ట్.. వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. టెన్షన్..
Ys Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అధికారపార్టీ వైసీపీ రెండోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలతో ముందుకువెళ్తోంది.. దీనిలో భాగంగా వైసీపీ అధినేత సీఎం జగన్ పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. రిపోర్టులు తెప్పించుకుని, నియోజకవర్గ పరిస్థితులపై వరుసగా సమీక్షలు జరుపుతున్న సీఎం జగన్ ఇప్పటికే.. పలు చోట్ల నియోజకవర్గా ఇన్‌ఛార్జులను మార్చారు. మొదటి లిస్ట్ లో 11 మందిని మార్చగా.. సెకెండ్ లిస్ట్‌లో 27 మందిని మార్చారు. ఈ తరుణంలోనే ఫైనల్ లిస్ట్ కూడా రిలీజ్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వరుసగా సమీక్షలు జరిపిన సీఎం జగన్ 29 మందితో ఇవ్వాళ ఫైనల్ లిస్ట్ విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 14 మందిపై క్లారిటీ వచ్చిందని.. ఈ రాత్రికి మార్పులపై తుది జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 38 చోట్ల ఇన్‌ఛార్జులను మార్చగా.. ఇవ్వాళ 29 మంది లిస్ట్ బయటకు వస్తుందని పేర్కొంటున్నారు. వీటితో కలిపి మొత్తం 67 మంది మార్చనున్నట్లు పేర్కొంటున్నారు.

వైసీపీ అభ్యర్థుల తుది జాబితా.. ఇవాళ రాత్రి కానీ.. రేపు కాని విడుదలవుతుందని.. పేర్కొంటున్నారు. 175 సెగ్మెంట్లలో మొత్తం 67మందిని మార్చనున్నట్లు తెలుస్తోంది. మూడో జాబితా వడపోత ఈ రాత్రి నాటికి పూర్తవుతుందని పేర్కొంటున్నారు. ఈ మేరకు పలువురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే పిలుపువచ్చింది. దీంతో సీఎం క్యాంప్ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యేలు క్యూలు కట్టారు. వారితో సంప్రదింపుల అనంతరం సీఎం జగన్ మూడో జాబితాను విడుదల చేయనున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..