CM Jagan: సీఎం జగన్ సంచలనం.. భవిష్యత్‌లో కుటుంబానికి కాకుండా ప్రతి వ్యక్తికి ‘ఆరోగ్య శ్రీ’ కార్డు

|

Aug 11, 2021 | 2:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు...

CM Jagan: సీఎం జగన్ సంచలనం.. భవిష్యత్‌లో కుటుంబానికి కాకుండా ప్రతి వ్యక్తికి ఆరోగ్య శ్రీ కార్డు
Cm Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.  టీచర్లు సహా, స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పారు.  వ్యాక్సిన్లు వృథాకాకుండా మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. 18–44 ఏళ్ల మధ్యనున్న వారికి కూడా వ్యాక్సిన్లు ఇవ్వాలి కాబట్టి దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం పేర్కొన్నారు.  ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారు, ఉద్యోగులు, సిబ్బందికి అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచనలు చేయాలన్న సీఎం ఆదేశించారు.

ఆరోగ్య శాఖపై కూడా సమీక్ష

ఆరోగ్య శ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల డేటా.. క్యూఆర్‌ కోడ్‌ రూపంలో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.  భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరు మీద ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సీఎం చెప్పారు. వీటిని ఆధార్‌కార్డు నంబర్‌తో లింక్‌ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు  పేర్కొన్నారు.  ఆరోగ్యశ్రీ లేదా ఆధార్‌ నంబర్‌ చెప్పిన వెంటనే ఆరోగ్య వివరాలు లభ్యమయ్యే విధానాన్ని పరిశీలించాని సీఎం సూచించారు.  పిల్లలు అన్ని రకాల వ్యాక్సిన్లు తీసుకుంటున్నారా? లేదా? అన్న వివరాలు కూడా ఆరోగ్యశ్రీ కార్డుల్లో నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై విలేజ్‌ క్లినిక్స్‌ ఫోకస్ పెంచాలని సీఎం సూచించారు. గ్రామాల్లో కాలుష్య నివారణపై కూడా దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు.  గ్రామాల్లోని నీరు, గాలి, మట్టి నమూనాలను పరిశీలించి కాలుష్య స్థాయిలపై తగిన వివరాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మూడు నెలల్లో సిబ్బంది కొరత అనేది లేదన్న మాట తనకు చెప్పగలగాలని సీఎం ఆకాంక్షించారు. జాతీయ ప్రమాణాల స్థాయిలో రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందాలని సీఎం సూచించారు. ట్రైబల్‌ ప్రాంతాల్లో వైద్య సేవలు ఎలా అందుతున్నాయన్న దానిపై పర్యవేక్షణ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Also Read: 3 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. అన్యోన్యంగా కాపురం.. ఓ పాప.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్

యువతి అనుమానాస్పద మృతి.. ఇంట్లో నల్లటి మరకలు.. రంగంలోకి డీఎస్పీ ప్రశాంతి