ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎం జగన్.. మీకు ఏయే నెలల్లో డబ్బు పడుతుందంటే?
ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,96,148.09 కోట్ల రూపాయలకు లబ్ధిదారులకు అందించామన్నారు మంత్రి చెల్లుబోయిన. అనంతరం 2023-24 సంవత్సరానికి సంబంధించి వివిధ సంక్షేమ పథకాలు, వాటికి కేటాయించిన ..
2023–24 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2023–24 ను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,96,148.09 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించామన్నారు మంత్రి చెల్లుబోయిన. అనంతరం 2023-24 సంవత్సరానికి సంబంధించి వివిధ సంక్షేమ పథకాలు, వాటికి కేటాయించిన నిధుల వివరాలను పొందు పరచిన క్యాలెండర్‌ను సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఏప్రిల్ 2023 – జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఈబీసీ నేస్తం
మే 2023 – వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ (మొదటి విడత), వైఎస్సార్ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన(మొదటి విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్ మత్స్యకార భరోసా
జూన్ 2023 – జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జులై 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీ తోఫా (రెండో త్రైమాసికం)
ఆగష్టు 2023 – జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర