AP Ration Card: రేషన్ కార్డు లేని వారికి చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలివే..

కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.. రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించనున్నారు.

AP Ration Card: రేషన్ కార్డు లేని వారికి చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలివే..
Ap Ration Card

Updated on: May 06, 2025 | 6:41 PM

కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.. రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులు.. అంటే.. రేషన్‌కార్డు స్ల్పిట్‌, కార్డుల్లో కొత్త సభ్యుల చేరిక, చిరునామాలో మార్పులు చేసేందుకు కూడా అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే రేషన్‌కార్డుల్లో మార్పుల కోసం 3.28లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటన్నింటిని పరిశీలించి మార్పులు చేస్తామని.. నాదేండ్ల మనోహర్ వెల్లడించారు.

అయితే.. రేషన్ కార్డులలో మార్పులు చేయనున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ వివరించారు. QR కోడ్‌ సెక్యూరిటీ ఫీచర్లతో స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని.. రేషన్ కార్డులపై ప్రభుత్వాధినేతల ఫోటోలు లేకుండా కేవలం ప్రభుత్వ చిహ్నాలతోనే స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఈ కార్డుల్లో కుటుంబసభ్యుల పేర్లు చక్కగా కనిపించేలా ఉంటుందదన్నారు. అంతేకాకుండా.. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే గడిచిన ఆరు నెలలుగా తీసుకున్న రేషన్‌ వివరాలు కనిపిస్తాయంటూ వెల్లడించారు.

నెలరోజులపాటు ఈ రేషన్‌ కార్డు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి తమ వివరాలు తెలుసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్‌ నుంచి స్మార్ట్‌ కార్డులు జారీ అవుతాయని.. ప్రస్తుతం ఏపీలో 95 శాతం మేర ఈ కేవైసీ పూర్తి అయిందన్నారు. ఈకేవైసీ పూర్తి అయిన వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని.. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు. దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునేలా వెసులుబాటు ఉందని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..