AP Free Sand Policy: జులై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

|

Jul 03, 2024 | 4:51 PM

జులై 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంతి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి, ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సుదీర్ఘ సమీక్ష..

AP Free Sand Policy: జులై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Free Sand Policy
Follow us on

అమరావతి, జులై 3: జులై 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంతి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి, ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో ఇసుక పాలసీ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, గృహనిర్మాణ రంగం కుదేలైందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2014- 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో అమలులో ఉన్న ఇసుక విధానం, 2019-2024 మధ్య అమ్మకాల లాభ, నష్టాలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు.

గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాల పేరుతో భారీగా దోపిడి జరిగిందని చెబుతున్న కూటమి సర్కార్‌.. ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వం అధికారం చేపట్టితే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని మేనిపెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పాలసీ ద్వారా పేదలకు ఉచితంగా ఇసుక అందించాలని నిర్ణయించుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇసుక అమ్మకాల విధానంలో ఎవరు లబ్దిపొందారు అనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీ వల్ల ధరలు పెంచడంతో పేదలు తీవ్రంగా నష్టపోయారని, దీంతో గృహ నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా రీచ్‌లు, స్టాక్‌పాయింట్లు, డంప్‌ల పరిధిలో ఎంత ఇసుక అందుబాటులో ఉందని అధికారులను సీఎం ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు వెల్లడించారు.

ఈ మేరకు సీఎం చంద్రబాబు బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై అధికారులతో చర్చించారు. దీనిలో భాగంగా ఖరీఫ్ సీజన్ కార్యాచరణతోపాటు నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.