
రాజధానిపై ఇది సార్ మా స్టాండు అని పుష్పరాజ్ స్టయిల్‌లో ఒట్టేసిమరీ చెబుతున్నాయి ఏపీలో రెండు ప్రధానపార్టీలు. అమరావతి వర్సెస్ మావిగన్.. ఏపీలో మళ్లీ క్యాపిటల్ కన్‌ఫ్యూజన్ షురూ చేసుకున్నాయి. నిన్నటిదాకా మావిగన్‌ని ఆషామాషీగా తీసుకున్న జనానికి గట్టి క్లారిటీనే ఇచ్చారు వైసీపీ చీఫ్ జగన్. నవ్వకండి, మేటర్ వెరీసీరియస్ అని అన్ని ఊహాగానాలకు తెర దించేశారు. మావిగన్‌ని వర్కౌట్ చేస్తున్నాం అంటే, అమరావతిని రద్దు చేస్తాం అనేగా అర్థం..? ఇందులో డౌటే లేదంటోంది వైసీపీ. ఎన్నికలొస్తే కొట్లాడ్డానిక్కూడా మావిగన్‌నే బ్రహ్మాస్త్రంగా తీసుకుంది. పోటీ అమరావతి వర్సెస్ మావిగన్ మధ్యే ఉంటుందన్నప్పుడు జగన్, పొలిటికల్ సైరన్ కూడా మోగించినట్టయింది. పైగా, మేం అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రైతుల్ని అన్యాయం చేసే ప్రభుత్వానికే వ్యతిరేకం అని మరో క్లారిటీ కూడా ఇస్తోంది వైసీపీ. కానీ, మీరు వద్దంటే నేను ఆగుతానా అన్నట్టుంది అమరావతిలో రాజధాని నిర్మాణం. ఎందుకంటే, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజధాని పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా, యుద్ధప్రాతిపదికన చేపట్టింది కూటమి సర్కార్. 50 కోట్లకు పైగా ఖర్చుతో 30 వేలమందికిపైగా కార్మికులతో, 5 వేల భారీ యంత్రాలతో అమరావతిలో నిర్మాణం జరుగుతోంది. శాసనసభ, హైకోర్టు, సచివాలయం కోసం ఐకానిక్ టవర్లు.. అధికారుల కోసం...