AP BJP: రాజకీయ కుట్రలు, కుతంత్రాలు చేయడంలో లెఫ్ట్ పార్టీ నేతలు సిద్ధహస్తులంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు

AP BJP Vs Left Parties: ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి పండగ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఇప్పటి వరకూ సీఎం జగన్ సర్కార్ వెర్సస్.. బీజేపీ నేతలు..

AP BJP: రాజకీయ కుట్రలు, కుతంత్రాలు చేయడంలో లెఫ్ట్ పార్టీ నేతలు సిద్ధహస్తులంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు
Ap Bjp

Updated on: Sep 07, 2021 | 9:03 AM

AP BJP Vs Left Parties: ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి పండగ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఇప్పటి వరకూ సీఎం జగన్ సర్కార్ వెర్సస్.. బీజేపీ నేతలు అన్నట్లు సాగిన ఈ రగడ.. లెఫ్ట్ పార్టీ ఎంట్రీతో మరో రూపు సంతరించుకుంది. తాజాగా లెఫ్ట్ పార్టీ ఆరోపణలపై ఏపీ బీజేపీ నేతలు మండిపడ్డారు.

బీజేపీ వినాయక చవితి పండుగను, రాష్ట్రంలో సామరస్య శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు వాడుకుంటున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న లెఫ్ట్ పార్టీల విమర్శను రాష్ట్ర బీజెపి తిప్పికొట్టింది. అంతేకాదు.. కోవిడ్ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి సహాయం చేయలేదని విపక్ష నేతలు అర్ధ రహిత ఆరోపణలు చేస్తున్నారంటూ మండి పడ్డారు.   అంతేకాదు వామపక్ష నేతలు మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, కుల, మత విద్వేషాలు రెచ్చకొట్టడంలో వామపక్ష పార్టీల నాయకులు సిద్ధహస్తులని ఆరోపించారు. అందుకనే లెఫ్ట్ పార్టీలను పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోని ప్రజలు వెళ్ళగొట్టారంటూ ఎద్దేవా చేశారు.

అసలు వామపక్ష పార్టీలకు సిద్ధాంతాలు లేవు .. ఎప్పుడూ ఎవరో ఒకరి పంచన చేరడం.. వాళ్ళు తిరస్కరించిన తర్వాత, ఏదో ఒక రాద్దాంతం చేస్తూ కాలం గడుపడమే అంటూ బీజేపీ నేతలు వామపక్ష నేతపై విరుచుకుపడ్డారు.

Also Read:

రాహుల్‌ గాంధీనే పార్టీ చీఫ్‌గా నియమించాలి.. యూత్‌ కాంగ్రెస్‌ తీర్మానం..

 వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో మాత్రం..