
తొలి రెండు రోజులు నిరసనలు, నినాదాలతో హాట్‌హాట్‌గా జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు ప్రశాంతంగా సాగాయి. నాలుగో రోజు సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరిపింది ఏపీ అసెంబ్లీ. చంద్రబాబు హయాంలో స్కిల్‌స్కామ్‌తో పాటు ఫైబర్ నెట్ స్కామ్‌లోనూ ప్రజాధనాన్ని దోచుకున్నారని మంత్రులు ఆరోపించారు. సభలో బుధవారం సవరణలతో కూడిన జీపీఎస్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు ఏపీ సివిల్ కోర్ట్స్ సవరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. వ్యవసాయరంగం అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు ఫైబర్ నెట్ అక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చను ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి..ఫైబర్ గ్రిడ్‌ను కరప్షన్ గ్రిడ్‌గా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసిందని ఆరోపించారు.
ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో చంద్రబాబు 114 కోట్ల రూపాయలు కొట్టేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. చంద్రబాబు అనుకూల వ్యక్తులకు ఫైబర్‌నెట్ టెండర్ కట్టబెట్టారని..హెరిటేజ్‌లో పనిచేసినవారే టెరాసాఫ్ట్‌లో డైరెక్టర్‌లుగా వ్యవహరించారని చెప్పారు. బీసీ జనగణనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రభుత్వం సామాజిక న్యాయం చేయాలంటే కులాల వారీగా జనగణన అవసరమని..సముచిత నిర్ణయాలు తీసుకునేందుకు జనగణన చేయాల్సిందేనని సభ్యలు తెలిపారు. కులగణనపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని.. గత పాలకులు కేవలం స్వప్రయోజనాలే చూసుకున్నారని ఆరోపించారు. కులగణనకు ప్రతిపక్షాలు కూడా సహకరించాలని కోరారు మంత్రి వేణు.
అసెంబ్లీ ముందుకు బుధవారం జీపీఎస్ బిల్లు రానుంది. సవరణలతో కూడిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జీపీఎస్‌లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్‌అప్‌పై..కొత్త ప్రతిపాదనలు బిల్లులో ప్రభుత్వం పెట్టింది. సీపీఎస్ ఉద్యోగులు జీపీఎస్‌కు మారేందుకు..కొంత సమయం ఇవ్వాలని బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు 10 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ప్రశ్నోత్తరాల అనంతరం మహిళ సాధికారతపై చర్చజరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన మహిళ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తీర్మానం చేసింది. అనంతరం అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, భూ సంస్కరణలపై చర్చ సాగింది. కీలక బిల్లులు ప్రవేశపెట్టే తరుణంలో టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారని మంత్రి చెల్లుబోయిన విమర్శించారు. బీసీలపై తెలుగుదేశానికి చిత్తశుద్ధి లేదని చెప్పారు.
మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు మంత్రులు మాట్లాడారు. సీఎం జగన్ తన నాలుగేళ్ల పాలనలో ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లను తుడిచారని..మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారని మంత్రి రోజా చెప్పారు. తన 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అనే సునామీలో చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, లోకేష్‌లు కొట్టుకుపోతారని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం