AP Privilege Committee: తిరుపతిలో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ రెండో సమావేశం.. టీటీడీ దర్శనాలపై చర్చ..

AP Privilege Committee: తిరుపతిలోని పద్మావతి గెస్ట్‌ హౌజ్‌లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ రెండో సమావేశం ప్రారంభమైంది.

AP Privilege Committee: తిరుపతిలో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ రెండో సమావేశం.. టీటీడీ దర్శనాలపై చర్చ..

Updated on: Jan 19, 2021 | 1:00 PM

AP Privilege Committee: తిరుపతిలోని పద్మావతి గెస్ట్‌ హౌజ్‌లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ రెండో సమావేశం ప్రారంభమైంది. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో టీటీడీ దర్శనాల విషయంలో ఎమ్మెల్యేల హక్కుల అంశంపై ప్రివిలేజ్ కమిటీ చర్చిస్తోంది. దర్శనాల కోసం ఎమ్మెల్యేలు పంపే సిఫార్స్ లేఖలపై టీటీడీ అధికారులు స్పందిస్తున్నారా? లేదా? అనే అంశంపై చర్చించారు. ఈ సమావేశానికి టీటీడీ అధికారులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

దీనికి ముందు, ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా ముందు మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేల హక్కులను కాపాడే దిశగా మొదటిసారి ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ తిరుపతిలో ప్రారంభించామని చెప్పారు. ప్రతి జిల్లాలో పర్యటించి 175 మంది శాసన సభ్యుల హక్కులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు.

కాగా, సోమవారం నాడు జరిగిన సమావేశంలో నగరి ఎమ్మెల్యే రోజా స్థానికంగా ఉన్న సమస్యలను ప్రస్తావించారని చెప్పారు. నగరి నియోజకవర్గంలోని హాస్పిటల్ రోడ్డు సమస్య విషయంలో కలెక్టర్ వ్యవహార శైలిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రోజా సూచించారని గోవర్థన్ రెడ్డి చెప్పారు. ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలియజేశారు. ఇవాళ టీటీడీ అధికారులతో సమీక్ష జరిపి.. దర్శనాల విషయంలో ఎమ్మెల్యేల నుండి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

Also read:

TCongress Leaders Arrested: ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ లీడర్స్, ఎక్కడిక్కడే నేతల అరెస్ట్

Ram, Sheep Marriage: గ్రామంలో వింత ఆచారం.. సంక్రాంతి తర్వాత గొర్రెకు, పొట్టేలుకు ఘనంగా పెళ్లి..