Fertilizers: డీఏపీ సహా ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు : ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

|

Aug 20, 2021 | 10:07 PM

రాష్ట్రంలో సమృద్ధిగా డీఏపీ నిల్వలు ఉన్నాయని.. కావాలని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ

Fertilizers: డీఏపీ సహా ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు : ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు
Kannababu
Follow us on

Minister Kannababu: రాష్ట్రంలో సమృద్ధిగా డీఏపీ నిల్వలు ఉన్నాయని.. కావాలని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో డీఏపీతో సహా ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్‌బీకేల్లో కూడా చాలినంత ఎరువు నిల్వలున్నాయని.. ప్రస్తుత సీజన్‌కు 20.20 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, 6.71 లక్షల ప్రారంభ నిల్వలున్నాయని ఆయన వెల్లడించారు.

తూర్పు గోదావరితో పాటు పలు చోట్ల డీఏపీ కొరత సృష్టించి కొంతమంది వ్యాపారులు ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరుపుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. సీజన్‌లో డీఏపీ 2,49,999 టన్నులు అవసరం కాగా, ప్రారంభ నిల్వ 42,589 టన్నులుండగా, కేంద్రం ఇప్పటివరకు 1,29,185 టన్నులు రాష్ట్రానికి సరఫరా చేసిందని మంత్రి పేర్కొన్నారు.

డీఏపీ 50 కేజీల బస్తా రూ.1200 మించి విక్రయించడానికి వీల్లేదన్నారు మంత్రి. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఒక్క డీలర్‌ అయినా ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని, అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేయిస్తామన్నారు. ఆర్‌బీకేల్లో 1,60,311 టన్నుల నిల్వలుంచగా, ఇప్పటి వరకు 64,795 టన్నుల విక్రయాలు జరిగాయన్నారు. ఇంకా 62,491 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

Read also: Minister Jagdish Reddy: కిషన్ రెడ్డిది ప్రజలను మోసం చేసే యాత్ర.. మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు