Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు మీకు వచ్చాయా..? లేదా..? ఆధార్‌తో సెకన్లలోనే తెలుసుకోవచ్చు.. వెబ్‌సైట్ ఇదే..

అన్నదాత సుఖీభవ డబ్బులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం చంద్రబాబు రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేశారు. ఇవాళ గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి డబ్బులను విడుదల చేశారు. రైతులు తమకు డబ్బులు వచ్చాయా.. లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది ఇందులో తెలుసుకుందాం.

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు మీకు వచ్చాయా..? లేదా..? ఆధార్‌తో సెకన్లలోనే తెలుసుకోవచ్చు.. వెబ్‌సైట్ ఇదే..
Annadata Sukhibhava Status

Updated on: Mar 13, 2026 | 7:15 PM

ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులను ఇవాళ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేసింది. గన్నవరంలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు నిధులను విడుదల చేశారు. దీంతో రైతుల అకౌంట్లో రూ.4 వేలు అయ్యాయి. ఇక పీఎం కిసాన్ కింద రూ.2 వేలు కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. కూటమి ప్రభుత్వ ఉగాది కానుకగా మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 6.85 లక్షలమంది రైతులకు రూ.6 వేల చొప్పున రిలీజ్ చేసింది. ప్రతీ ఏటా ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతలుగా రూ.14 వేలు అందించగా.. ఇప్పుడు మూడో విడత రూ.6 వేలు జమ చేయడంతో మొత్తం ఒక్కొక్క రైతుకు రూ.20 వేలు అందించినట్లయింది.

స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?

మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాయో.. లేదో అనేది ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. కేవలం మీ ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెకన్లలోనే స్టేటస్ చెస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభం పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌లోకి వెళ్లి మీకు డబ్బులు వచ్చాయా.. లేదా.. అనేది స్టేటస్ సులువుగా చెక్ చేసుకోవచ్చు. అలాగే అన్నదాత సుఖీభవ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. యాప్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

ప్రాసెస్ ఇదే..

-https://annadathasukhibhava.ap.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లండి

-హోమ్ పేజీలో Know Your Status అనే ఆప్షన్ ఎంచుకోండి

-ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి

-ఆ తర్వాత సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి

-మీ పేమెంట్ వివరాలు అక్కడ కనిపిస్తాయి

-ఈకేవైసీ యాక్టివ్‌లో ఉందా.. లేదా వివరాలు కూడా అక్కడ తెలుస్తాయి

-ఒకవేళ మీకు డబ్బలు పడకపోతే రైతు సేవా కేంద్రంలో సంప్రదించండి

-గ్రామ, వార్డు సచివాలయంలో కూడా అధికారులను అడిగి సమస్య తెలుసుకోవచ్చు

ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి

మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు అందకపోతే ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 155251 నెంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. ఒకవేళ మీకు అర్హత ఉండి అందకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారందరికీ అన్నదాత సుఖీభవ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అర్హత ఉన్నా పొందకుండా ఎవరూ ఉండకూడదని సూచించారు.

 

 

Follow Us