Corona RTPCR Test: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఒక వైపు కరోనా మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండేళ్లుగా వెంటాడుతున్న కరోనా.. ఇప్పుడు థర్డ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. కరోనా వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ (RT-PCR) పరీక్షల ధరను తగ్గించింది. ఐసీఎంఆర్ (ICMR) గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్ -RTPCR పరీక్షల ధరను రూ.350గా నిర్ణయించింది ప్రభుత్వం. ప్రస్తుతం పంపే ఆర్టీపీసీఆర్ శాంపిళ్లను పరీక్షించేందుకు ఎన్ఏబీఎల్ ల్యాబ్‌లలో రూ.499 ఉంది. ఇప్పుడు వాటినని రూ.350కు తగ్గించింది ప్రభుత్వం. ఈ రేట్లను ఆస్పత్రులు, ల్యాబ్‌లలో తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో.. 38,055 శాంపిల్స్ ని పరీక్షించగా 6,996 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2117384కి చేరింది.
ఇవి కూడా చదవండి: