AP Weather: ఏపీ అంతటా వానలే వానలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

|

Jun 28, 2024 | 2:39 PM

రైతులకు పని రోజులు మొదలయ్యాయి. జోరు వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం...

AP Weather: ఏపీ అంతటా వానలే వానలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Andhra Weather Report
Follow us on

అసలైన రెయినీ సీజన్ మొదలైంది. ఇకపై దండిగా పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, ఉత్తర ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది. రానున్న 2 రోజుల్లో ఇది వాయువ్య దిశగా కదలే అవకాశం ఉంది. మరోవైపు గాలి కోత / షీర్ జోన్ ఇప్పుడు సుమారుగా 20°N పొడవునా 3.1 & 5.8 కిమీల మధ్య సముద్ర మట్టం ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————

శుక్రవారం:-తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

——————————–

శుక్రవారం, శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

ఆదివారం ;- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-

—————-

శుక్రవారం, శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..